22/08/2020
కొన్ని సంవత్సరాల క్రితం ప్రతీ సంవత్సరం ఈ రోజు కోసం ఎదురు చూసేవాళ్ళం... ఉదయాన్నే లేచి అప్పుడప్పుడే పుడుతున్న ఈ మీడియాలో ఆయన గురించి గొప్పగా చెప్పే మాటలు కోసం వేచిచూసే వాళ్ళం........
మాకు ఊహ తెలిసినప్పటి నుండి సినిమా హీరో అంటే ఎవరు అని అడిగితే...... అది ఒక్క మాత్రమే అని జంకు , భయం ఏమాత్రం లేకుండా చెప్పేవాళ్ళం........
గ్యాంగ్ లీడర్ సినిమా చూసి *చేయి చూసావా ఎంత రఫ్ గా వుందో* అనుకుంటూ మేము గడిపిన రోజులు......
*ముఠా మేస్త్రి* చూసి *మరీ అంత స్పీడ్ అయిపోమాకు* అనుకుంటూ గడిపిన రోజులు.......
*హిట్లర్* సినిమా చూసి *అంతోద్దు ,ఇది చాలు* అనే డైలాగ్ చెప్పుకుంటూ గడిపిన రోజులు..........
*ఘరానా మొగుడు సినిమా చూస్తూ* ఏది FACE టర్నింగ్ ఇచ్చుకో కొంచెం అంటూ మేము చేసిన గోల............
*మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా* అంటూ మేము చేసిన గోలలు.........
ఎలా మర్చిపోము చెప్పు అన్నయ్య.........
బుక్ మైషోలు మాకు తెలియవు.,
థియేటర్ బయట పోలీసులు తరుముతుంటే గోడలు దూకడమే మాకు తెలుసు
ఆన్లైన్ లు, జూక్ బాక్స్ లు మాకు తెలియదు., ఆడియో షాప్ లో తెల్లవారుజామున మొదటి బంచ్ ఆడియో కాసెట్స్ లో ఫస్ట్ క్యాసెట్ కొన్న కిక్ మాకు తెలుసు.
Mp3 ప్లేయర్లు మాకు తెలియవు,
ఎదో ఒక షాప్ లో కూర్చుని ఫాస్ట్ బీట్ సాంగ్స్ కి రేపు థియేటర్ లో స్టెప్ లు ఏ రేంజ్ లో ఉంటాయో అని ఊహించుకోవడం మాకు తెలుసు.
ఫ్లెక్సీలు హోర్డింగ్ లు మాకు తెలియవు,
పెయింటర్ వేసిన కౌటౌట్ ని పెడుతుంటే ఫేస్ పెట్టే టైం లో అర్ధరాత్రి కొన్ని వందలమంది వేసిన ఈలలు మాకు తెలుసు.
యూట్యూబ్ లో సాంగ్స్, వ్యూస్ ఇవేమీ మాకు తెలియవు,
లాస్ట్ సాంగ్ వరకు చూసేసి ఫాంట్ వెనక ఉన్న దుమ్ము దులుపుకుని, గుంపులు గుంపులు గా వెళ్లిపోవడం మాకు తెలుసు.
Idle బ్రెయిన్ రేటింగ్ లు, గ్రేట్ ఆంధ్రా రివ్యూ లు మాకు తెలియవు,
సినిమా ఎలా ఉన్నా సూపర్ హిట్ అంటూ అరుచుకుంటూ వెళ్లడం లో ఉన్న కిక్ మాకు తెలుసు.
ఇన్ని వేల ఆనందాలు ఇచ్చావ్, నీ చిన్న చిన్న తప్పులు మాకెందుకు అన్నయ్యా...
జీరో నుండి మొదలుపెట్టి, శిఖరం చేరుకున్న వాడివి ఆ రూట్ గురించి వేరే వాడు నీకు చెప్పాల్సిన పని లేదు.
ఒక్క సినిమాలలోనే కాకుండా, నిజజీవితంలో మాకు ఎన్నో మంచి లక్షణాలు నేర్పావు అన్నయ్య.........
ఒక సామాన్య మధ్యతరగతి ఇంట్లో పుట్టిన ఒక పెద్ద కొడుకు, ఎంత బాధ్యత గా ఉండాలో నేర్పావు.........
ఒక సామాన్య మధ్యతరగతి పెద్దబ్బాయి , తలచుకుంటే ఎన్ని సంచలనాలు చెయ్యగలడో నిరూపించావు...
ఒక మాములు వ్యక్తి అసామాన్య శక్తిగా ఎలా తయారవ్వొచో చూపించావు...
ఒక మాములు మనిషి, ఒక జాతికి ఎలా వన్నె తేగలడో చూపించావు.......
*రక్తదానం, నేత్రదానం* అంటూ ఎందరో ప్రాణాలను పరోక్షంగా కాపాడిన నిజమైన దేవుడవు నీవు.........
ఎన్నెన్నో గుప్తదానాలు చేసి ఏనాడు గుర్తింపు కోరని మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని చూపించావు..........
ఎన్నో ఆరాచకాశక్తులు నిన్ను ప్రజాక్షేత్రంలో వెనక్కి నెట్టి ఉండొచ్చు కాక......కానీ
*గన్ కన్నా పవర్ ఉన్న తమ్ముడు నీకు ఉన్నాడు*
*నీ పేరు శాశ్వతం గా నిలబెట్టే కొడుకు నీకు ఉన్నాడు*
*నీ డాన్స్ లకు వన్నె తగ్గకుండా చూసే మేనల్లుళ్లు ఉన్నారు*
*అన్నిటికీ మించి నిన్ను గుండెల్లో పెట్టి ఆరాధించే కోట్ల మంది అభిమానులు ఉన్నారు*
*తెలుగు సినిమాకి మకుటం లేని మహారాజువి నువ్వు...*
*నీ స్థానం మా గుండెల్లో , నర నరాల్లో ఎప్పటికీ పదిలం అన్నయ్య*............
నువ్వు మరింత ఆనందకరమైన ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నెన్నో జరుపుకోవాలి అని కోరుకుంటూ...........
Many many more happy returns of the day Annayya *MEGASTAR PADMABHUSHAN DR.CHIRANJEEVI*