20/08/2026
నెల్లూరు రూరల్ 36వ డివిజన్ ప్రధానమైన సమస్యలు పరిష్కరించగలరా పరిష్కరించలేరా....పరిష్కరిస్తే ఎప్పుటి లోపల పరిష్కరిస్తారు పరిష్కరించ లేకపోతే దాని కారణాలు ఎప్పుడు తెలియజేస్తారు.
సమస్యల వలయంలో నెల్లూరు రూరల్ 36వ డివిజన్
📍అభివృద్ధి దేవుడు ఎరుక అనేక సమస్యలతో నరకం చూస్తున్న 36వ డివిజన్ ప్రజలు
📌 ఫతేఖాన్పేట రాగి చెట్టు సెంటర్ నుంచి రైతు బజార్ సైడ్ మెయిన్ రోడ్డు సుమారుగా 60 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు వెయ్యడం జరిగింది. సిమెంట్ రోడ్డు వేసి పూర్తిగా ప్రజలకు వాడుకలోకి వచ్చి 6 నెలలు కూడా గడవక ముందే ఇంటి ఇంటికి మినరల్ వాటర్ అని ప్రతి ఇంటి ముందు రోడ్డు పగలగొట్టి అరకొర పనులు చేసి వెళ్లారు.ఇంకో 20 రోజులకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అని రోడ్డు మొత్తం ఇష్టనుసారంగా తవ్వేశారు. అధికారులు నాయకుల సమన్వయ లోపం వలన సుమారు 60 లక్షల విలువ చేసే సిమెంట్ రోడ్డు సర్వనాశనం అయిపొయింది.
📍డివిజన్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న విద్యుత్ అధికారులు
📌 36వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటిది కేవలం విద్యుత్ సమస్య కాదు చిన్నపిల్లల ప్రాణాలకు సంబంధించిన అత్యంత సీరియస్ భద్రతా సమస్య. డివిజన్లో ఉండే అనేక ట్రాన్స్ఫా ర్మ్స్ మరియు వాటి కనెక్టింగ్ వైర్లు భూమికి అత్యంత దగ్గరగా ఉన్నాయి
సాయంత్రం అయితే పిల్లలు ఆడుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తెలియక వైర్లను తాకడం, దగ్గరకు వెళ్లడం జరిగితే విద్యుత్ షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది.చిన్న పిల్లలకు విద్యుత్ ప్రమాదాల తీవ్రత తెలియదు.కాబట్టి విద్యుత్ పరికరాలు, కరెంట్ వైర్లు, ట్రాన్స్ఫారం ప్రజలకు అందుబాటులో లేకుండా రక్షణ కల్పించాల్సిన బాధ్యత విద్యుత్ అధికారుల పై ఉంది.అత్యంత క్రిందకు ఉన్న ప్రతి ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మే కట్టి ఎత్తు పెంచాలి అలాగే చుట్టూ తగిన రక్షణ కంచె వేసి పిల్లలకు,స్థానికులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత విద్యుత్ అధికారుల పైన ఉంది.ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాదు ప్రమాదం జరగక ముందే అధికారులు చర్యలు తీసుకోని ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ పిల్లలు, స్థానిక ప్రజలు దగ్గరకు వెళ్లకుండా శాశ్వత భద్రతా చర్యలు తీసుకోవాలి
అనేది మా ప్రధాన డిమాండ్.
📍సంవత్సరాల తరబడి కడుతున్న ప్రభుత్వ పాఠశాల,మర్మతులు
📌 నెల్లూరు జిల్లా మొత్తం మాకు అనవసరం రూరల్ నియోజకవర్గం మొత్తం కూడా మాకు అనవసరం అయ్యా ముఖ్యమంత్రి ముద్దుల కొడుకా నారా లోకేష్ గారు కేవలం 36వ డివిజన్ పరిధిలో ఉండే రామయ్య బడి సంవత్సరాల తరబడి నిర్మాణం జరుగుతూనే ఉంది మరమ్మతులు జరుగుతూనే ఉంది వీటి కారణంగా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎప్పటిలోగా పూర్తి చేసి విద్యార్థులకు అందిస్తారు నాయకులు అధికారులు చెప్పాల్సిన బాధ్యత ఉంది.
📍 అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య పనులు
📌 36వ డివిజన్ పరిధిలో ప్రధాన కాలువ స్వర్ణాల చెరువు నుంచి 36 వ డివిజన్ వైపు వెళ్లే కాలువ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కొన్ని నెలల నుంచి నీటిపారుదల నిలిపివేసి ఉన్నారు దీని కారణంగా అధిక దోమలు దుర్గన్నంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు కనీసం చెత్త కూడా తొలగించడం లేదు నెలకు ఒకసారి కూడా ఫాగింగ్ చేయడం గాని ఆయిల్ బాల్స్ వేయడం కానీ ఎటువంటి చర్యలు కూడా మున్సిపాలిటీ అధికారులు చేయకపోవడంతో చుట్టుపక్కల ఉండేటటువంటి స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు ఈ సమస్యకు పరిష్కారం ఎప్పటిలోపు చేస్తారో కూడా సంబంధిత అధికారులు నాయకులు తెలియచేయాల్సినటువంటి బాధ్యత ఉంది.
📍ఇంటి ఇంటికి మినరల్ వాటర్ కాస్త కాలువల్లో రోడ్ల పై నిర్వీర్యంగా వదిలేశారు.
📌 36వ డివిజన్ పరిధిలో ఇంటి ఇంటికి మినరల్ వాటర్ అని ప్రతి ఇంటికి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు చేయాల్సి ఉంటే డివిజన్లో 60 శాతం మినరల్ వాటర్ పైప్ లైన్లను కాలువలలో రోడ్లపైన ఇంటికి పది అడుగుల దూరంలో ఇష్టానుసారంగా వదిలేయడం జరిగింది. ఇవి ఇంటింటికి పోలాయా లేక ఇంటిముందు వీధి కొళాయ అని కూడా నాయకులు అధికారులు సమాధానం చెప్పాలి. ప్రజల దగ్గర ముక్కు పిండి నీటి పన్ను వసూలు చేస్తున్నటువంటి అధికారులు కాలువల్లో రోడ్ల పై ఎంతో నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి ఈ పైప్ లైన్లను ఎందుకు ప్రశ్నించట్లేదు కూడా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులకు నాయకులకు ఉంది.
📍 నిరుపయోగంగా NTR సుజల స్రవంతి ప్లాంట్
📌 NTR సుజల స్రవంతి ప్లాంట్ లక్ష్యం 20 లీటర్ల శుద్ధి చేసిన తాగునీటిని ₹2కు ప్రజలకు అందించడం.36వ డివిజన్ పరిధిలో శిథిలా వ్యవస్థకు వచ్చేస్తుంది. దీన్ని ఎప్పుడు లోపల ప్రారంభిస్తారు ప్రజలకు అందుబాటులో ఎప్పుడు తీసుకువస్తారు కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత సంబంధిత అధికారులకు నాయకులకు ఉంది.
📍 శిధిల వ్యవస్థకు వచ్చిన పోలీస్ క్వాటర్స్
📌 36వ డివిజన్ పరిధిలో ప్రధానమైన సమస్య శిధిల వ్యవస్థకు వచ్చిన పోలీస్ క్వాటర్స్.పోలీసుల కోసం నిర్మించిన క్వార్టర్స్ ప్రజలకు రక్షణ కల్పించే ప్రాంతంగా ఒకప్పుడు ఉన్నింది.కానీ అవే శిథిలావస్థలో ఉండి స్థానికులకు భయం కలిగించే పరిస్థితి రావడం చాలా బాధాకరం.ఖాళీగా ఉన్న భవనాల పరిసరాల్లో చెత్త, పిచ్చి మొక్కలు,దోమలు, పాములు వంటి సమస్యలు అనేకం ఉన్నాయి. సాయంత్రం అయితే మహిళలు అటు సైడ్ వెళ్లాలన్న భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి.రాత్రి వేళల్లో ఈ ప్రాంతంలో ప్రజలకు భద్రత పై భయాందోళనలు కలగకుండా అధికారులు నాయకులు తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కాదు ముందుగానే ప్రమాదాన్ని గుర్తించి నివారించడం అధికారులు నాయకుల బాధ్యత అని తెలియజేస్తున్నాం.