99tv News Podili

99tv News Podili 99tv News PODILI..

UFFF YEH SIYAPAA : అనుష్క భాగమతి దర్శకుడి.. హిందీ మూకీ చిత్రం! త్వరలో ప్రేక్షకులను అలరించటానికి సెప్టెంబర్ 5న దేశ వ్యాప్...
31/08/2025

UFFF YEH SIYAPAA : అనుష్క భాగమతి దర్శకుడి.. హిందీ మూకీ చిత్రం! త్వరలో ప్రేక్షకులను అలరించటానికి సెప్టెంబర్ 5న దేశ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది...

02/08/2025

బయ్యర్లు కొంటున్న.... సూపర్నెంట్ వద్దంటున్నారు...

ప్రశ్నిస్తే బైటికి వెళ్ళమంటున్నారు...

రైతుల పట్ల దురుసు ప్రవర్తన...

పొదిలి పొగాకు బొర్డులో రైతులకు సూపర్నెంట్ మద్య వాగ్వావాదం...

టూబాకొ బొర్డ్ చైర్మన్ కు ఫిర్యాదు... సూపర్నెంట్ ప్రవర్తన పై భగ్గుమన్న రైతులు...

ప్రకాశంజిల్లా పొదిలి టూబాకొ బొర్డులో రైతులకు కార్యాలయ నిర్వహణాధికారి మద్య వాగ్వావాదం చొటు చేసుకుంది.

పొదిలి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ తన బేళ్ళు అమ్మకానికి తేగా బయ్యర్లు బేళ్ళు కొంటుండగా సూపర్నెంట్ అడ్డుతగిలి ఇవి బాగాలేవని చెప్పడంతో చంద్రశేఖర్ ఆగ్రహానికి గురయ్యాడు.

బయ్యర్ కొంటుంటే మీరెందుకు వద్దంటున్నరని ప్రశ్నించడంతో, చంద్రశేఖర్ ను వేలం కేంద్రంనుంచి బయటకు వెళ్ళాలని సూచించారు.

అంతటితో చంద్రశేఖర్ పొగాకు బొర్డు చైర్మన్ కు చరవాణి ద్వారా ఫిర్యాదు చేసి సూపర్నెంట్ ప్రవర్తన పై వివరించాడు.

మంచి పొగాకును కుడా లోగ్రేడ్ పొగాకుగా నిర్ణయించి రైతుల పొట్టకొడుతున్నారని చంద్రశేఖర్ ఆరొపించాడు.

తాను తెచ్చుకున్న ఆరుబేళ్ళ లో ఒక చెక్ ను కొంటానికి బయ్యర్ ముందుకొస్తే అది కుడా వద్దని సూపర్నెంట్ అడ్డుపడటం విచారకరమన్నారు.

చివరికి బయ్యర్లను బతిమాలడి తన బేళ్ళు అమ్ముకొవాలసిన పరిస్దితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశాడు.

రైతులందరు ప్రతిరొజు ఇదేవిధంగా ఇబ్బంది పడుతున్నారని ప్రతిరొజు బేళ్ళు తీసుకరావడం వెనక్కి తీసుకొపొవడం జరుగుతుందని తెలిపారు.

27/06/2025
08/06/2025

రాజదాని అమరావతి మహిళాలపై అసభ్యంగా మాట్లాడిన సాక్షి టివి ఎడిటర్ కెఎన్ రాజును, కొమ్మినేని శ్రీనివాసరావును తక్షణమే అరెస్ట్ చేయాలని ప్రకాశంజిల్లా పొదిలి టిడిపి తెలుగు మహిళల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
స్దానిక విశ్వనాదపురం సెంటర్ నుంచి పొలీస్ స్టేషన్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అమరావతి రాజదాని పై అసభ్యకరంగా మాట్లాడిన వారిని సాక్షి యజమాన్యం తక్షణమే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం పొలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వారి వెంటనే అరెస్ట్ చేయాలని కొరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చుడాలని వారు కొరారు.
ఈ కార్యక్రమములో టిడిపి నాయకులు ముల్లా ఖుద్దుస్,ఇమాంసా,గునుపూడి భాస్కర్,ఓబులరెడ్డి,కాటూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

07/06/2025

ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో పొగాకు రైతుల సమస్యల గురించి ఈనెల 11 వ తారీకున వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి లో పర్యటన...

30/05/2025

ప్రకాశంజిల్లా పొదిలి నగర కమీషనర్ కెఎల్ నారాయణరెడ్డి ,ఆర్టిసి డిఎం శంకర్రావు సంయుక్తంగాఆర్టిసి బస్టాండ్లో లోని స్టాల్స్ ను,హొటల్స్ ను ఆకస్మికంగా తనిఖి చేశారు. ఈ సందర్బంగా పలు వ్యాపారసంస్దలలో ఆశక్తి కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆర్టిసి బస్టాండ్లో నిర్వహిస్తున్న క్యాంటీన్ లోని అపరిశుభ్ర వాతవరణం చూశి కమీషనర్ అసహనం వ్యక్తంచేశారు. కనీసం టాయిలెట్స్ కుడా ఉపయోగకరం కాని నీటిని ఉపయెగించడం ఏంటని ఫ్రశ్నించారు, ప్రిజ్ లో దుర్వసన వస్తున్న చెట్ని, కుల్లిపొయిన కొబ్బరి వంటివాటిని చూసి మండి పడ్డారు. బస్టాండ్ బైయట కొన్ని అనాధికారిక వ్యాపారాలు నిర్వహిస్తు ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న పలు వ్యాపారస్తులకు వెంటనే ఆక్రమణలు తోలగించాలని ఆక్రమణలు స్వచ్చందంగా తొలగించక పొతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్టాండ్లో ఎమ్మార్పి రేట్లు, టాయిలెట్స్ పరిశీలించారు. డిపొలో పరిశుభ్రమైన వాతవారణం ఉండేటట్లు చూడాలని ఆయన కొరారు.
పట్టణంలో ఎటువంటి వ్యాపార సంస్ద అయిన సరే నగర పంచాయితీ కాల్వలపై ఉండరాదని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఎటువంటి పరిస్దితిలో సహించేది లేదని హెచ్చరించారు. వ్యాపార సంస్థలు అపరిశుభ్రమైన వాతవరణంలో వంటలు నిర్వహించకుడదని, మరిగి పొయిన నూనె వాడరాదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే భారి పెనాల్టిలు వేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమములో ఆర్టిసి సిబ్బంది, మున్సిపల్ శానిటరి ఇన్స్పెక్టర్ మారుతి రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

30/05/2025

ప్రకాశంజిల్లా పొదిలి పట్టణంలోని విశ్వనాదపురం మొదటిలైన్లో ఒక కర్రిస్ పాయింట్ నుందు ఆకస్మికంగా గ్యాస్ సిలిండర్ పేలి పలు వస్తువులు ధ్వసం అయ్యాయి.
గ్యాస్ మీదా వంటమీద చేస్తున్న సమయంలో ఆకస్మికంగా మంటలు వచ్చి భారి శబ్దం తో సిలెండర్ పేలి పొయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికి ప్రమాదం సంభవించలేదు, పెద్ద శబ్దం రావడంతో చుట్టుప్రక్కల ప్రజలు అందరు వులిక్కిపడ్డారు. వంటసామాన్లు,గ్యాస్ పొయి ఇవన్ని తునతుఖలు అయ్యాయి. విషయం తెలుసుకొని సంఘటన స్దలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశాయి. ఈ ప్రమాదం గ్యాస్ లీక్ వల్లన లేక విద్యుత్ షార్ట్ సక్యుట్ వల్లన అనేది తెలియాల్సి ఉంది. ప్రమాదంలో ప్రక్కన ఉన్న ఫొటొస్టూడియో సిలింగ్ మొత్తం ఉండిపొయింది.

26/05/2025

పొగాకు రైతుల చివరి క్వింటావరకు అమ్మకాలు కొనసాగుతాయని రైతులు అధైర్య పడవలసిన పనిలేదని మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు.
ప్రకాశంజిల్లా పొదిలి పొగాకు వేళం కేంద్రాన్ని సందర్శించి రైతులతో అధికారులతో మాట్లాడి వేలం నిర్వాహణణను పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతు పొగాకు కంపెనీల ప్రతినిధులను మెప్పించి,ఒప్పించి రైతులకు అన్యాయం జరగకుండా పొగాకు కొనుగొలు చేయిస్తామని హమీ నిచ్చారు. గత ప్రభుత్వ ప్రతినిధులు మద్యం స్కాం నుంచి ప్రజల దృష్టిని మర్చలని పొదిలి పొగాకు వేలం కేంద్రం సందర్శన పెట్ఠుకున్నారని, ఇన్ని రొజులు రైతుల మీదా ప్రేమ ఎమైపొయిందని ఆయన ప్రశ్నించారు. రైతులు పండించిన పంటను మొత్తం కొనుగొలు చేపించాలసిన బాద్యత ఎన్డిఎ కుటమి తీసుకుంటుదని గత కొన్ని రొజులుగా లొగ్రేడ్ కొనుగొలు సాగలేదని ఇప్పుడు లొగ్రెడ్ గుడా కొనుగొలు సాగుతుందని ఆయన తెలిపారు. రాజకీయాలు మానుకొని రైతులకు ఏవిధంగా మేలు చేయాలో సలహాలు ఇస్తే స్వాగతీస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమములో టిడిపి నాయకులు పండు అనిల్,ఇమాంసా,గునుపూడి భాస్కర్,ఓబులరెడ్డి,గీత తదితరులు పాల్గోన్నారు.

25/05/2025

రైతుల్లో మనొదైర్యం నింపి, వారికి అండగా నిలవడానికి ఈనెల 28 న రాష్ట్ర మాజి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకాశంజిల్లా పొదిలికి వస్తున్నారని రైతులు అందరు ఎంతో ఆశక్తితో ఎదురు చూస్తున్నరని ఒంగొలు పార్లమెంటరి వైసిపి సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.

పొదిలిలో జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్బంగా హెల్ ప్యాడ్ ను పరిశీలించారు, పొదిలి దర్శి రొడ్ లోని ఎస్ఎస్ఆర్ ప్రెటొల్ బంక్ సమీపంలో హెలికాప్టర్ దిగి అక్కడనుంచి రొడ్ మార్గం ద్వారా ఉదయం 9-30 పొగాకువేళం కేంద్రానికి చేరుకొని రైతులతో ముఖాముఖి చర్చిస్తారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమములో వైసిపి జిల్లా అద్యక్షులు బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కెవి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

22/05/2025

ప్రకాశం జిల్లా పొదిలి లో ఈనెల 28వ తారీఖున వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన

పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలించి పొగాకు రైతుల కు గిట్టుబాటు ధరల గురించి రైతులతో ముఖాముఖి

Address

Ongole

Telephone

+919885385420

Website

Alerts

Be the first to know and let us send you an email when 99tv News Podili posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to 99tv News Podili:

Share